Tuesday, May 5, 2009

మన జీవితము

జీవితం చిన్నదే ,ఆశాశ్వతమైనదే కావచ్చు కానీ విలువైనది అందమైనది కూడా.మనము సంతోషం గా వుండం దేవుడు మనకు అన్ని అవయవాలు సక్రమంగా ఇచ్చినా.ప్రకృతిని తృప్తిగా ఆస్వాదించే అవకాశం వున్నా ఆపని చేయం. కాళ్ళని చుట్టేసి ఎత్తుకోమని మారాం చేసే పిల్లల్ని పక్కకు తోసి పని వుందంటూ వెళ్లి పోతుంటాం.గుభాళించే పూలని ఆఘ్రానించటం మరచి పోతుంటాం.మంచి పాట వినిపిస్తున్నా అర్జెంటు పని గుర్తొచ్చి పరుగు తీస్తుంటాం .
గట్టిగా గుండెల మీద చేయి వేసుకుని చెప్పండి మనం ఇష్టమైన కూర వండుకుని తీరిగ్గా తిని ఎన్నాళ్ళయింది (టీ.వీ.ఎదురుగా కూర్చోకుండా ). ఫ్రెండుతో ఏ అరమరికలు లేకుండా ,ఏ స్వార్థము లేకుండా మాట్లాడి ఎన్నాళ్ళయింది .పక్కవాడి కష్టానికి స్పందించి తోడుగా నిలిచి ఎంత కాలం అయ్యింది.ముద్దు లొలికే చిన్నారులతో ముచ్చట్లాడి ఎన్నిరోజులయింది.అసలు ఇలాంటి పనుల వల్ల కలిగే ఆనందం ఎంత బాగుంటుందో మనం గమనిస్తున్నామా . ప్రతి క్షణం విలువైనదే అని తెలిసినా అర్థవంతంగా జీవించటం ఎప్పటికప్పుడు మరచిపోతుంటాం.
ఏదో హడావుడి.అలజడి.పక్కవాడి కంటే పైనుండాలనే తాపత్రయం.వ్యాపార దృక్పధం .ఎంతో సంపాదించాలి ఏదో సాదించాలనే తాపత్రయం మనల్ని అన్ని ఆనందాలకు దూరం చేస్తోంది .దీనికి ఫుల్ స్టాప్ పెట్టలేమా.మనం మనం గా బ్రతకలేమా.మరోసారి చర్చిద్దాం.

No comments:

Post a Comment