Tuesday, April 13, 2010

మళ్ళీ ఆసిడ్ దాడి ?!

ఎన్నిసార్లు ఆసిడ్ దాడులు జరిగినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా వుండదేమి ?ఆ విషయం పై వొక సమగ్రమైన ప్లానింగ్ అంటూ ఉండదా?కటినంగాశిక్షిస్తాం అంటూ మొక్కుబడి ప్రకటనలు తప్ప దానిపై వొక అవగాహన అంటూ ఉందా?ఈసారి వొక కొత్త పాయింట్ లేవనెత్తారు ఏంటంటే ఆసిడ్ ని నిషేధిస్తే బంగారు పని చేసే వారికి ఇబ్బంది అని.అది తెలిసిన వారు ఆసిడ్ తో అవసరం వున్న వారు తప్ప మిగతా వారికి అందకుండా జాగ్రత్త పడవచ్చు కదా?నిన్న వొక టి.వి. చానల్ వారు ఆసిడ్ ఎంత ఈజీ గా కొనుక్కోవచ్చో చూపారు.
దీనికి పరిష్కారం ఏమిటంటే ఆసిడ్ అవసరం వున్న వ్యాపారులకు వారి గుర్తింపు కార్డు లు వగైరా వివరాలు తీసుకుని వారికి కావలసిన మోతాదు లో మాత్రమే అమ్మాలి.ఇతరులకు అమ్మకుండా జాగ్రత్త పడాలి.ఆసిడ్ లాంటి ప్రమాదకరమైన పదార్థాలు అమ్మే వారి లిస్టు పోలిసుల దగ్గర వుండాలి.ఆసిడ్ నేరాలు చేసిన వారికి ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా వెంటనే కటినమైన శిక్ష విధించాలి.

Sunday, March 21, 2010

లీడరంటే అర్థం ఇదా?

శేఖర్ కమ్ముల చేసిన మరొక చైల్డిష్ సినిమా లీడర్.సరైన హోం వర్క్ లేకుండా ,పత్రికలూ టి.వి.లు చూసి సినిమా తీస్తే లీడర్ లాగా వుంటుంది.స్కూల్ కెళ్ళే ప్రతి విద్యార్థికి ఐదు వందలు నెల నెల పంచితే ఎంత అవుతుందో శేఖర్ కు తెలుసా?దేశ బడ్జెట్ మొత్తం కూడా సరిపోదు.థాట్ రాగానే సరిపోదు.థింక్ చేయాలి.రాజకీయాలంటే కొనడము అమ్మడమూనా?అసలు వొక సీన్ కు మరొక సీన్ కు పొంతనే వుండదు.స్క్రీన్ప్లే చాలా చెత్తగా వుంది.లీడర్ అంటే అర్థం ఇంతకీ శేఖర్ కు తెలుసా?నాయకత్వం అంటే తెలుసా?లక్షలాది మందిని వొక్క తాటి పై నడిపించగలవాడు నాయకుడు.సినిమాలో హీరో వెనుక వుండేది ఇద్దరంటే ఇద్దరే జోకర్లు.వారికి కూడా ఏదో ఆశ చూపి తిప్పుకుంటాడు.అసలు అర్జున్ పాత్ర హీరో పాత్రేనా ?డబ్బులిచ్చి ,నీచమైన టెక్నిక్ లు వుపయోగించి ముఖ్యమంత్రి కావడం తప్ప మిగతా ఏవిషయం లోను సక్సెస్ కాదు. లక్ష కోట్లు అనడం తప్ప ఆ డబ్బు తో ఏం చేస్తాడో చెప్పడు.మన రాష్ట్ర బడ్జెట్ ప్రతి సంవత్సరము లక్ష కోట్లు వుంది.ఐనా అన్నిరంగాలకు డబ్బు సరిపోక సతమతం అవుతున్నారు.ఆ విషయం శేఖర్ కు తెలుసా?ఇప్పుడు రాజకీయ రంగం లో వున్నది వున్నట్టు తీయడానికి మళ్ళీ సినిమా తీయక్కర్లేదు.టి.వి.చూస్తె సరిపోదా?ప్రేక్షకుడు డబ్బు వదిలించుకుని నీ సినిమా చూడాలా?ఏదైనా కొత్త పరిష్కారం చూపాలి గానీ. అంత పేరు గల ఎ.వి.ఎం.సంస్థ ఇలాంటి కథ ని ఎలా వొప్పుకుందో?చివరికి ముగింపు కూడా సరిగా లేదు.బహుశా శేఖర్ కే ఏం ముగింపు ఇవ్వాలో అర్థమైనట్లు లేదు.ఇలా చెప్పుకుంటూ పొతే ప్రతి సీన్ లో వొక తప్పు వుంటుంది.సినిమా అంతా తప్పుల తడక.ఇంతకూ ముందువచ్చిన కొన్ని సినిమాలను చూసి వండినట్టుంది.పులిని చూసి............

Wednesday, March 17, 2010

మరి వీరి పై ఎవరు ధర్నా చేయాలి?

పైరసీ పై టాలివుడ్ నిరాహార దీక్షలు ధర్నా లు చేస్తోంది.పైరసీ ఇంతగా అభివృద్ధి చెందడానికి కారణం ఎవరు?సినిమా టికెట్లు భారీ గా పెంచి సామాన్యుడికి వారే దూరం అయ్యారు.రిలీజ్ ఐన మొదటి రోజే మొత్తం దండుకోవాలని టికెట్ ఇదు వందల రూపాయలకు పెంచి అమ్ముతున్నారు.మరో వైపు బలిసిన హీరోలు ,ప్రోడ్యుసార్లు కలిసి చిన్న సినిమాలకు దియేటర్లు ఇవ్వకుండా చేసి చిన్న నిర్మాతలను నాశనం చేస్తున్నారు.మంచి సినిమాలు రాకుండా చేస్తున్నారు.ఫాల్సు ప్రిస్తేజి కోసం ,ఫాల్సు ఇమేజి కోసం ప్రొడక్షన్ కాస్ట్ పెంచేస్తున్నారు.పిచ్చి కతలు పట్టుకుని కేవలం భారీ సెట్టింగులు చూపితే చాలు సినిమా ఆడేస్తుందని పిచ్చి ఊహలకు పోయి ప్రేక్షకులని దగా చేస్తున్నారు.మనం ఏదైనా వస్తువుని చూసి బాగుంటే నచ్చితే కొంటాం .కాని ఎలా వుంటుందో తెలియనిది నమ్మకంతో మాత్రమే వెళ్ళేది సినిమా వొకటే .అంట నమ్మకం తో వెళ్ళిన ప్రేక్షకున్ని దారుణంగా మోసం చేస్తున్నారు.ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించి ,టికెట్ ధర తగ్గిస్తే పైరసీ అనేదే వుండదు.ఆ పని చెయ్యరు .ఎందుకంటే హీరోలు కోట్లు దండుకోవాలి,ప్రేక్షకుడు ,చిన్న నిర్మాతలు నాశనం కావాలి అనేది వారి సిద్ధాంతం.

Saturday, January 16, 2010

ఆస్ట్రేలియా లో నే కాదు ఇక్కడా వున్నారు

ఆస్ట్రేలియా లో మనవారి మీద దాడులు చేస్తున్నారని గగ్గోలు పెట్టడం ఎందుకు ? ఇక్కడా లేరా జాత్యహంకారులు.కుల పిచ్చి ,మత గజ్జి ,ప్రాంతీయ దురద కలవారు .ఇతర ప్రాంతాల వారిని భాగో అనేవారు ,వేరే రాష్ట్రము నుంచి వస్తే ఉద్యోగాలు చేయొద్దు అనేవారు.ఇంగ్లిష్ సినిమాలను ఆడనిస్తాం కాని ఇక్కడ పుట్టి పెరిగిన వారి సినిమాలను ఆడనివ్వం అని పిలుపు నిచ్చే వారు.ఇతర కులాల వారిని పైకి ఎదగానివ్వం అనేవారున్నారు. మాకు తప్ప మిగత కులాల వాళ్లకు ఎమీచేత కాదనే వారున్నారు.దాడులు చేస్తున్నారు.చేయిస్తున్నారు.వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు కాదు వంద సంవత్సరాల క్రితమే బ్రిటిష్ వారు చెప్పనే చెప్పారు మీకు పరిపాలన చేత కాదని ,మీదంతా కప్పల తక్కెడ యవ్వారమని,వొకడు పైకి ఎదుగుతుంటే పక్క వాడే కిందికి లాగేస్తాడని.రాష్ట్ర పరిస్థితిని గమనించే ఎవరికైనా వారు చెప్పింది అక్షర సత్యమని తెలియకపోదు.ఇక ఆస్ట్రేలియా వారిని తిట్టుకుని ఏంలాభం.ఇప్పటి కైనా తెలుగు వారంతా వొక్కటిగా వుంటే ప్రపంచం లో పరువు దక్కు తుంది.

Sunday, August 2, 2009

ఈ దాడులు జీవితాన్ని తీర్చి దిద్దుతాయా?2

జూలై ౨ న ప్రేమికుల దాడుల గురించి పోస్ట్ పూర్తిగా రాయలేదు.పూర్తి చేసేలోపే మళ్ళీ రెండో మూడో దాడులు జరిగాయి.అసలు వీళ్ళ ఆలోచనా ధోరణి ఏమిటో అర్థం కావడం లేదు.ఇదొక మాస్ హిస్టీరియా లాగా వుంది.కేవలం ప్రకటనల తో ,కఠిన శిక్షలతో లాభం లేదు.వాటి పర్యవసనాలేమిటో ప్రభుత్వము వివరించాలి.నిందితుల్లో విద్యావంతులుండడం బాధించే విషయం. అంటే మన విద్యలో లోపం వుంది.కొన్ని కోర్సుల్లో మానవతా విలువలు నేర్పడం లేదు.సమాజం లో మనుషులు ఎలా మెలగాలో నేర్పడం లేదు.ఎదిగే వయసులో హార్మోన్లు చేసే అల్లరిని డైవర్ట్ చేసే విధంగా నో ,ఐడెంటిటీ క్రైసిస్ ని సంతృప్తి పరిచే విధంగా నో క్రీడలు,ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు ఏవీ లేవు.కలిసి పనిచెయ్యడంలో వుండే త్ర్హుప్తి ,ఆనందం ఏమీ తెలియడం లేదు.అందువల్ల ఎవరైనా అమ్మాయి మాట్లాడితే చాలు అది ప్రేమే అనుకుంటున్నారు.దీనికి తోడూ అర్ధ చదువు చదివిన ,అసలేమీ చదవని సినిమా దర్శకులు తీసే అర్థం లేని ,అనుభవం లేని,వూహాజనితమైన ,అపరిపక్వ ప్రేమ కథలతో కూడిన సినిమాలు నేటి యువతరానికి చేస్తున్న హాని ఎంతో వుంది.వీటికి తోడూ ఫూలిష్ ,సెన్సార్ లేని టి.వి.సీరియల్లు .
ఈ దాడులకు మొదటగా తల్లిదండ్రులది బాద్యత.తరువాత విద్య వ్యవస్థది.నెక్స్ట్ ప్రభుత్వం ,ఆ తరువాత సమాజం.
ఇప్పుడు అర్జెంటు గా చేయ వలసింది ఏమిటంటే క్రీడలని ప్రోత్సహించాలి.ప్రతి విద్యార్థి సైన్యంలో వొక సంవత్సరమైనా పనిచేయాలి.విద్యా వ్యవస్థలో నైతిక విలువలకు కొన్ని పాఠాలు వుండాలి.అర్థం లేని సినిమాలు ,టి.వి.సీరియళ్ళపై అదుపు వుండాలి.అన్నిటికి మించి ఇలాంటి దాడుల వల్ల బాధితుల &నిందితుల జీవితాలు ఎలా అర్ధంతరంగా ముగిసిపోతాయో ,ఎలాంటి బాధాకర పరిస్థితులు ఏర్పడతాయో ప్రచార సాధనాల ద్వార వివరించాలి.విద్యా సంస్థల్లో వీటి పైన చర్చ జరగాలి.మనం వుదాసీనత వహిస్తే ఇదొక అంటు వ్యాధిలా మారి సమాజాన్ని దహించే ప్రమాదం వుంది.

Thursday, July 2, 2009

ఈ దాడులు జీవితాన్ని తీర్చి దిద్దుతాయా ?

మళ్ళీ యాసిడ్ దాడులు ,రాగింగ్ ఈ రోజు వార్తల్లో !?వారిని కఠినంగా శిక్షిస్తామని మంత్రుల పోలీసుల వువాచ. ఇందులో తప్పు పట్టాల్సింది ఎవర్ని?అవును మొన్న ఓసారి ఇలాగే జరిగితే ఎన్కౌంటర్ చేసారు మరి పరిస్థితిలో ఏమైనా మార్పు వచ్చిందా? మళ్ళీ మళ్ళీ అవే దాడులు. మరొక విషయం నిందితులు శిక్షకు సిద్ధమయ్యే వస్తున్నారు.అలాంటప్పుడు దాడులు ఎలా ఆగుతాయి?ఎలా ఆగుతాయంటే సమస్య మూలాల్లోకి వెళ్లి పరిష్కారం వెదుకుతే .



ఈ దాడుల వెనుక నేర మనస్తత్వం కంటే సామాజిక కారణాలు వున్నాయ.పదిహేను నుండి పాతిక సం" వయస్సు అందమైన దశ అంతే ప్రమాదకరమైనది కూడా.ఈ దశ లో శరీరం లో హార్మోన్లు చేసే అల్లరి మనిషిని కుదురుగా వుండనీయవు.ముఖ్యంగా ప్రేమ విషయంలో .మన ముందు తరాల్లో చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు చేసే వారు కాబట్టి ఇలా ప్రేమ దోమ అనడానికి చాన్స్ లేదు.కాని ఇప్పుడు చదువు కేరీరు అంటూ పెళ్ళిళ్ళు లేటు కావడం వల్ల శరీరం లో కలిగే సహజ వాంచలను తీర్చుకో లేని పరిస్థితి ఇలాంటి వున్మాదస్థితి కి ప్రేరేపిస్తోంది.అందరిలోనూ ఈ పరిస్థితి వుండకపోవచ్చు.శాతాల్లోతేడా .ఈవ్టీజింగ్ అయినా రాగింగ్ అయినా కారణం ఆ వయసు లో కలిగే అలజడిని సరైన మార్గం లోకి మల్లించలేక పోవడమే.ఇందుకు కేవలం ఆ యా యువకులనే తప్పుపట్టలేం.ఇందులో సమాజం బాద్యత ప్రభుత్వ బాధ్యత కూడా వుంది .



ఈ వయసులో కలిగే వుత్సాహాన్ని ,వుల్లాసాన్ని సరైన చానల్ కి మల్లించాలి.ఇతర దేశాల్లో ప్రతి విద్యార్థి సైన్యం లో కొంత కాలం పని చెయ్యాలనే nibhandan వుంది.బ్రిటన్ రాకుమారుడు కూడా అల పనిచేసాడని ఇటీవలే వార్తల్లో చూసాం.దీని వల్ల యువతకి తన ఎనర్జీ కి వొక ఇంకొకమరొక విషయం.క్రమశిక్షణ ఏర్పడుతుంది.దేశభక్తి అలవడుతుంది.ఆరోగ్యంగా వుంటారు.ఇలా ఎన్నో ప్రయోజనాలున్నాయి.ఈ రూల్ పెడితే దేశం లో మధుమేహం అన్నదే వుండదు.

Saturday, May 16, 2009

మన జీవితము

ఓటు హక్కు మనకు రాజ్యాంగం కల్పించిన తిరుగులేని ఆయుధం . దీన్ని ప్రభుత్వ అధికారులు ఎంత తేలిగ్గా తీసుకుంటారో ఇటీవలి సంఘటనా ద్వారా తెలిసింది.ఈ ఎన్నికల్లో నాకు డ్యూటీ వేసారు.అలాగే పోస్టల్ బాలట్ కొరకు దరఖాస్తు చేసుకున్నాను.మిగతా వారికి పోస్టల్ బ్యాలట్ వచ్చింది కానీ నాకు రాలేదు.రెవిన్యూ ఆఫీస్ లో అడిగితే తొందరేముంది వస్తుందిలే అన్నారు.నెలరోజులు ఆఫీస్ చుట్టూ తిప్పుకున్నారు. కౌంటింగ్ రెండు రోజులుందనగా తాసిల్దారుని అడిగితే దాని గురించి మర్చిపోండి ఇక రాదు అన్నాడు.మేము ఇదు మందిమి అక్కడ పోగైన వాళ్ళం అప్పుడే గ్రూప్ గా ఏర్పడి సమాచార హక్కు చట్టం ప్రకారం మాకు పోస్టల్ బ్యాలట్ ఎందుకు రాలేదో కారణం చెప్పమని దరఖాస్తు చేసుకున్నాం.దానికి కూడా వాళ్లు సహకరించరు.పట్టు విడవకుండా మేము పోరాటం చేస్తే దరఖాస్తు తీసుకుని రసీదు కూడా ఇవ్వమంటారు.గట్టిగా అడిగి రసీదు తీసుకున్నాం. దానికి చలాన్ కట్టాలి .ఆవిషయం తర్వాత చెప్పారు.ఈలోపు కౌంటింగ్ టైం అయిపొయింది. అయినా దీన్ని ఇంతటితో వదలకూడదని నిర్ణయించాం. రేపు సోమవారం వెళ్లి చలాన్ కట్టి మా అప్లికేషను చూడాలి.మాకే కాదు ఇంకో రెండువందల యాభై పైగా రిజెక్ట్ అయ్యాయి .వారంతావూరికే వున్నారు.రాజ్యాంగం మనకు కల్పించిన హక్కుల్ని మనం పొందకుండా ఇలా మౌనంగా వుండడం మంచిది కాదు.మీలో ఎవరైనా ఇలాంటి సమస్య వుంటే సమాచార హక్కు చట్టం ప్రయోగించంది.ఇది రాష్ట్ర వ్యాప్తంగా వున్నా సమస్య .ఒక వైపు పోలింగ్ డ్యూటీ కి వెళ్ళకపోతే చర్యలు తీసుకుంటా మంటారు.మరో వైపు వోటు హక్కుకు ఇలా విఘాతం కలిగిస్తారు.ఇది న్యాయమేనా?అధికారులు సమాధానం చెప్పాలి.లేదా కోర్టులు జోక్యం చేసుకుని పరిష్కారం సూచించాలి.