Sunday, August 2, 2009

ఈ దాడులు జీవితాన్ని తీర్చి దిద్దుతాయా?2

జూలై ౨ న ప్రేమికుల దాడుల గురించి పోస్ట్ పూర్తిగా రాయలేదు.పూర్తి చేసేలోపే మళ్ళీ రెండో మూడో దాడులు జరిగాయి.అసలు వీళ్ళ ఆలోచనా ధోరణి ఏమిటో అర్థం కావడం లేదు.ఇదొక మాస్ హిస్టీరియా లాగా వుంది.కేవలం ప్రకటనల తో ,కఠిన శిక్షలతో లాభం లేదు.వాటి పర్యవసనాలేమిటో ప్రభుత్వము వివరించాలి.నిందితుల్లో విద్యావంతులుండడం బాధించే విషయం. అంటే మన విద్యలో లోపం వుంది.కొన్ని కోర్సుల్లో మానవతా విలువలు నేర్పడం లేదు.సమాజం లో మనుషులు ఎలా మెలగాలో నేర్పడం లేదు.ఎదిగే వయసులో హార్మోన్లు చేసే అల్లరిని డైవర్ట్ చేసే విధంగా నో ,ఐడెంటిటీ క్రైసిస్ ని సంతృప్తి పరిచే విధంగా నో క్రీడలు,ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు ఏవీ లేవు.కలిసి పనిచెయ్యడంలో వుండే త్ర్హుప్తి ,ఆనందం ఏమీ తెలియడం లేదు.అందువల్ల ఎవరైనా అమ్మాయి మాట్లాడితే చాలు అది ప్రేమే అనుకుంటున్నారు.దీనికి తోడూ అర్ధ చదువు చదివిన ,అసలేమీ చదవని సినిమా దర్శకులు తీసే అర్థం లేని ,అనుభవం లేని,వూహాజనితమైన ,అపరిపక్వ ప్రేమ కథలతో కూడిన సినిమాలు నేటి యువతరానికి చేస్తున్న హాని ఎంతో వుంది.వీటికి తోడూ ఫూలిష్ ,సెన్సార్ లేని టి.వి.సీరియల్లు .
ఈ దాడులకు మొదటగా తల్లిదండ్రులది బాద్యత.తరువాత విద్య వ్యవస్థది.నెక్స్ట్ ప్రభుత్వం ,ఆ తరువాత సమాజం.
ఇప్పుడు అర్జెంటు గా చేయ వలసింది ఏమిటంటే క్రీడలని ప్రోత్సహించాలి.ప్రతి విద్యార్థి సైన్యంలో వొక సంవత్సరమైనా పనిచేయాలి.విద్యా వ్యవస్థలో నైతిక విలువలకు కొన్ని పాఠాలు వుండాలి.అర్థం లేని సినిమాలు ,టి.వి.సీరియళ్ళపై అదుపు వుండాలి.అన్నిటికి మించి ఇలాంటి దాడుల వల్ల బాధితుల &నిందితుల జీవితాలు ఎలా అర్ధంతరంగా ముగిసిపోతాయో ,ఎలాంటి బాధాకర పరిస్థితులు ఏర్పడతాయో ప్రచార సాధనాల ద్వార వివరించాలి.విద్యా సంస్థల్లో వీటి పైన చర్చ జరగాలి.మనం వుదాసీనత వహిస్తే ఇదొక అంటు వ్యాధిలా మారి సమాజాన్ని దహించే ప్రమాదం వుంది.

No comments:

Post a Comment